గంధం భువన్ జై కు సీఎం అభినందన
ఇటీవల యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ( 8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించిన గంధం భువన్ జై తన తండ్రి, ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడితో కలిసి మంగళవారం సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా భువన్ జై ప్రతిభను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సీఎంని కలిసిన వారిలో కోచ్ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తదితరులు ఉన్నారు.