ఇకపై ఎక్కడ నుంచయినా పెన్షన్

ఉత్వర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధులు, వికలాంగులు, వితంతులు తదితరులకు అందించే సామాజిక పెన్షన్లను రాష్ట్రంలో ఎక్కడ నుంచయినా తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాల వల్ల రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి ఆరు నెలల సమయం కంటే ఎక్కవ సమయం ఉంటే పెన్షన్లను అక్కడే తీసుకోవచ్చని ఉత్వర్వుల్లో వెల్లడించారు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వార్డు, గ్రామ వాలంటీర్ ను సంప్రదించి వివరాలు చెపితే పెన్షన్ దారుల వివరాలను మ్యాపింగ్ చేస్తారు..మ్యాపింగ్ చేసిన తరువాత పెన్షన్లను అక్కడే తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. పెన్షన్ దారుల అభీష్టం మేరకు ఈ మార్పు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.