ఆన్ లైన్ కు నిర్మాతల మద్దతు
మంత్రి పేర్ని నాని వెల్లడి
కొందరి వ్యక్తిగత అభిప్రాయాలతో
మాకు సంబంధం లేదు : దిల్ రాజు
ఆన్ లైన్ టికెట్ విధానానికి సినీ నిర్మాతలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని అతిధి గృహంలో మంత్రి పేర్నినానితో తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు,డి వి వి దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి తదితర నిర్మాతలు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆన్ లైన్ టికెట్ విధానంకు అందరం అనుకూలంగా ఉన్నారనీ, టికెట్ ధరల నిర్ణయంలో పెరిగిన పెట్టుబడులను కూడా దృష్టిలో పేరుతో ఆన్ లైన్ టికెట్లను ఇప్పటికే ప్రయివేటుగా అమ్ముతున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కొందరి వ్యక్తిగత అభిప్రాయాలను సినీ ఇండస్ట్రీ అభిమతంగా మార్చవద్దన్నారు. రాజకీయాలకూ, సినిమాలకు సంబంధం లేదన్నారు. చిత్ర పరిశ్రమ బాగుండాలనే రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నాయన్నారు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండేందుకు వీలుగా ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టమని తామే కోరినట్టు తెలిపారు.