బద్వేలు ఉప ఎన్నికకు జనసేన దూరం
బద్వేలు ఉప ఎన్నికల బరిలో నిలబడకూడదని జనసేన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు కు కూడా తెలియచేసినట్టు తెలిసింది. వైసీపీ టికెట్ ను చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే ఇవ్వటంతో నైతికతకు కట్టుబడి పోటీలో అభ్యర్ధిని నిలబెట్టకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో అక్కడ బిజెపి అభ్యర్ధిని నిలబెట్టాలా, వద్దా అనే విషయంపై బిజెపి సందిగ్ధంలో పడింది.