ప్రజలెవరూ ఆవేశాలకు గురికావద్దు

  • రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • డిజిపి గౌతం సవాంగ్ 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ..శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలెవరూ ఆవేశాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామనన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేయవద్దనీ.. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామనీ..ప్రజలందరూ సంయమనం పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published.