పట్టాభి అరెస్ట్

  • తలుపులు బద్దలు గొట్టి  మరీ అరెస్ట్ 
  • ప్రభుత్వమే బాధ్యత వహించాలి 
  • పట్టాభి భార్య చందన 

టీడీపీ నేత పట్టాభిని బుధవారం రాత్రి విజయవాడ గవర్నర్ పేట పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టాభి ఇంటికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐపిసి సెక్షన్లు 153 a, 505(2), 504 R/W, 120b కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ తన భర్త పట్టాభిని తీసుకెళ్ళారనీ, ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదనీ, ఆయనకి ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలని పట్టాభి భార్య చందన అన్నారు. పోలీసులపై తమకు నమ్మకం లేదనీ, దీనిపై కోర్టుకు వెళతామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published.