విశాఖ ఏజెన్సీలో గంజాయి ధ్వంసం
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భాగంగా ఆదివారం గూడెంకొత్తవీధి మండలం, జెరిలాపంచాయతీ కొండ్రుపల్లి, రాళ్లగెడ్డ, చింతలవాడ గ్రామాల్లో 37.5 ఎకరాలు, రెండోవ టీం మొండిగెడ్డ పంచాయతీ అడ్డుకోట గ్రామంలో 55 ఎకరాలలో ఉన్న మొత్తం 92.5 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.ముంచింగిపుట్టు మండలం, వనగుమ పంచాయతీ కిరంబో గ్రామంలో 22.5 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
జి.మాడుగుల మండలం కోరపల్లి పంచాయతీ వంటలమామిడి, లువ్వసింగి పంచాయతీ వశబంధ , జి.మాడుగుల పంచాయతీ డాబార్లగొంది గ్రామాల్లో 50 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
డుంబ్రీగూడ మండలం ఆరమ పంచాయతీ నడిమివాలస , పమురాయి , గోడసార , కితలంగీ పంచాయతీ పులగూడ గ్రామాల్లో 11 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
విశాఖపట్నం జిల్లాలో ఈరోజు మొత్తం 176 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్., వారి ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి ఇతర శాఖల సమన్వయంతో , ఎస్సైలు షేక్ షమీర్, ఎల్.ప్రశాంత్ కుమార్, పి.మనోజ్ కుమార్, ఏ.శ్రీనివాసరావు, ఆర్.సంతోష్ కుమార్ తదితరలు గంజాయి ధ్వంసంలో పాల్గొన్నారు.