ap news

టీయూడబ్ల్యుజెలో చేరిన చిన్న పత్రికల అసోసియేషన్

150 మంది ప్రచురణకర్తలు, ఎడిటర్ల చేరిక

ఇక టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా కార్యకలాపాలు

తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె)లో చేరింది. సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో బుధవారం (జనవరి 19,2022) నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.  రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి పత్రికలు నిర్వహిస్తున్న దాదాపు 150మంది ప్రచురణకర్తలు, సంపాదకులు ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల సమక్షంలో టీయుడబ్ల్యుజె లో చేరారు. దాదాపు అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర విభజన తర్వాత 8 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘం జర్నలిస్టుల హక్కుల సాధనకై రాజీలేని పోరాటాలు చేస్తున్నందువల్లే తాము ఆకర్షితులై టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, బాలకృష్ణలు స్పష్టం చేశారు. తమ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ నాయకులు దయానంద్, షరీఫ్,అల్వాల్ హన్మంతు, అక్తర్ హుస్సేన్, వెంకటయ్య, ఖాసీం, రాజిరెడ్డి, మాధవరెడ్డి, అజంఖాన్, రామకృష్ణ, పృథ్వీరాజ్, రామారావు,సాయిరాం,అమన్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జె కార్యదర్శి శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాసరెడ్డి, విరాహత్ అలీ సమక్షంలో టీయుడబ్ల్యుజెలో చేరుతున్న దృశ్యం

నాటి నుండి పోరాడుతున్నాం : శ్రీనివాసరెడ్డి 

చిన్న, మధ్యతరగతి, మేగజైన్లకు న్యాయం చేకూర్చేందుకు తమ సంఘం నాటి నుండి నేటి వరకు పోరాడుతుందని ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం సంఘాలు పెట్టి ట్రేడ్ యూనియన్ స్వభావాన్ని దెబ్బతీసే వారిని క్షమించారదని ఆయన పిలుపునిచ్చారు. తమకు ఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వాలతో తాము యుద్ధం చేయమని, అయితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తే, జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే మాత్రం ఊరుకోబోమని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

రాష్రంలో శుభపరిణామం : విరాహత్ అలీ

రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న తమ సంఘం పనితీరుపై ఆకర్షితులై తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్స్ సంపాదకులు, ప్రచురణకర్తలు టీయుడబ్ల్యుజెలో చేరడం శుభపరిణామమని, వారిని స్వాగతిస్తున్నట్లు టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం 60ఏండ్ల క్రితం పురుడుబోసుకున్న తమ సంఘం ఎల్లప్పుడు అదే స్ఫూర్తితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *