టిడిపి నారీ సంకల్పదీక్ష

రాష్ట్రంలో మహిళా వ్యతిరేక పాలన సాగుతోందని, వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, ‍హత్యలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ అరాచక పాలనను గద్దె దింపేవరకు పోరాటం చేస్తామని టీడీపీ మహిళా నేతలు అన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం నాడు మహిళా సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా…

వంగలపూడి అనిత, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు

వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళాద్రోహి జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలి అనే లక్ష్యంతో అధినేత చంద్రబాబు గారి ఆదేశాలతో నారీ సంకల్ప దీక్ష చేపట్టాము. రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు చేస్తే చూస్తు ఊరుకోబోము. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

నారీ సంకల్పదీక్ష ప్రతిజ్ఞ

వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలు కన్నీళ్లు పెట్టని రోజు లేదు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు,హత్యలు,అత్యాచారాలు జరగని ప్రాంతం లేదు. గడిచిన రెండేళ్లలో మహిళలపై 1500కి పైగా జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం నిత్యవసర ధరలు పెంచటంతో‎ గృహిణులు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. కాసుల కోసం వైసీపీ నేతలు కల్తీ మద్యం, నాటుసారా, గంజాయి అమ్ముతూ మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. డ్వాక్రా సంఘాలను ధన దాహంతో జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు. మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమ గీతం పాడాలని, అందుకు సంసిద్దురాలునవుతానని ‎నారీ సంకల్పదీక్ష వేదికపై ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను

Leave a Reply

Your email address will not be published.