గౌతంరెడ్డి మరణం తీరని లోటు
కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమృతి తనన దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో గౌతంరెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డిని ని పరామర్శించారు. సహచర మంత్రిని కోల్పోయాం..వివాద రహితంగా అందరితో సఖ్యతగా ఉండేవారు..ఎంతో భవిష్యత్ ఉన్న యువనేతను కోల్పోవటం పార్టీకి తీరని లోటని అన్నారు. అంతకు ముందు గౌతంరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన వారిలో మరో మంత్రి నారాయణ స్వామి కూడా ఉన్నారు.