టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. గడిచిన 30 ఏళ్ళుగా టిటిడి ఉద్యోగులు ఇళ్ళ స్థలాల కోసం ఎదురుచూస్తున్నారనీ, వారందరికీ మూడు నెలల్లో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నివేశనా స్థలాలు ఇవ్వనున్నట్టు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇంటి స్థలాల కోసం రూ 61 కోట్ల 63 లక్షల చెక్కు జిల్లా కలెక్టర్ కు అందించారు. టీటీడీ లోని 5518 మంది ఉద్యోగులకు వడమాల పేట సమీపంలో 300 ఎకరాలో ఇంటి స్థలాలను ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

పాలకమండలిలో మార్పులు చేస్తాం..

టీటీడీ పాలక మండలిలో నేరచరితులు అంశంలో కోర్టు తీర్పుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కోర్టు తీర్పుని పరిశీలించి కోర్టు ఇచ్చిన సూచనల మేరకు టీటీడీ పాలకమండలిలో మార్పులు చేర్పులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.