మార్కాపురానికి తీరని అన్యాయం

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, స్వార్ధమే కారణం 

ఆందోళన బాట పట్టిన వైసీపీ నేత పెద్దిరెడ్డి 

మార్కాపురం జిల్లా సాధన ఉద్యమం ఊపందుకుంటోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని విస్మరించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం, స్వార్దం కారణంగానే మార్కాపురం జిల్లా అవసరాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి ఉద్దేశ్యపూర్వకంగా తీసుకెళ్లకుండా ప్రజా ప్రతినిధులు అన్యాయం చేశారన్ని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్న మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాలను కలిపి మార్కాపురం జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. జిల్లాల పునర్విభజన అంటూ చేస్తూ మొదట మార్కాపురం జిల్లా ఏర్పడుతుందన్న అభిప్రాయం కూడా అందరిలో ఉంది. దురదృష్టవశాత్తూ మార్కాపురాన్ని తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అవసరాలను గుర్తించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పొరుగునే గుంటూరు జిల్లా గుంటూరుతో పాటు నరసరావుపేట, బాపట్ల జిల్లాలుగా విడిపోతోంది. ఒంగోలుకు సమీపంలోనే ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపారు. నెల్లూరుకు సమీపంలో ఉన్న కనిగిరి ప్రాంతాన్ని మాత్రమే ప్రకాశంలోనే ఉంచారు. లోక్ సభ నియోజకవర్గాన్ని ప్రాతిపదిక చేసుకున్నారని భావించటానికి కూడా వీలులేదు. బాపట్ల పార్లమెంటు స్థానంలో ఉన్న సంతనూతలపాడును ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. ఏ కోణంలో చూసినా జిల్లాల పునర్విభజనలో పశ్చిమ ప్రాంతం అన్యాయానికి గురైంది.

ఒంగోలుకు పశ్చిమ ప్రాంతం ఎంత దూరమో చూడండి.. 

పెద్దిరెడ్డి ఆందోళన
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై అధికారపార్టీ వైసీపీలోనే ఉన్న పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఆందోళన బాట పట్టారు. మార్కాపురంలో నిరాహారదీక్షలతో పాటు ఇతర ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. మార్కాపురం జిల్లాను సాధిస్తామనీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతానికి న్యాయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రావని ప్రతినిధికి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.