పొట్టి శ్రీరాముల స్మరణలో..

సాయిచంద్ పాదయాత్రకు మద్దతు
కొప్పర్రు నుంచి నరసరావుపురం వరకు
రైతు రత్నాజీ పాదయాత్ర
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని స్మరిస్తూ సినీ నటుడు త్రిపురనేని సాయి చంద్ సాగిస్తున్న 380 కిలోమీటర్ల నడక దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా కొప్పర్రు రైతు నూకల రత్నాజీ సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. తన స్వగ్రామమైన కొప్పర్రు నుంచి నరసాపురం వరకు 10 కిలోమీటర్ల మేర తన మితృలతో కలిసి పాదయాత్ర చేపట్టి పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటల సమయంలో పాదయాత్రను ప్రారంభించారు.