ap news

జనంలోకి జగన్

  • జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు ప్రారంభ‌మైన క‌స‌ర‌త్తు
  • ముందుగా సీమ జిల్లాల్లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం
  • ఫిబ్ర‌వ‌రి 3,4 తేదీల్లో కీల‌క స‌మావేశం నిర్వ‌హ‌ణ‌
  • ఈలోగా గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయి క‌మిటీలు పూర్తి
  • ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో జిల్లాల‌కు జ‌గ‌న్‌

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ పున‌ర్నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ఈనెల 25న ఆపార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి విజ‌య‌సాయి రెడ్డి త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన త‌రువాత లండ‌న్ నుండి వ‌చ్చిన ఆయ‌న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తిన‌కుండా ఆయ‌న త‌న కార్యాచ‌ర‌ణ‌ను మ‌రింత ముమ్మ‌రం చేస్తున్నట్లు క‌నిపిస్తుంది. పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ముందుగా ఆయ‌న ఇచ్చిన మాట మేర‌కు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మౌతున్నారు. ముందుగా సీమ జిల్లాల్లో త‌న ప‌ర్య‌ట‌న ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటున్నారు. ఇందుకోసం ఫిబ్ర‌వ‌రి 3,4 తేదీల్లో కీల‌క స‌మావేశం నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ స‌మావేశంలో ఏఏ జిల్లాల్లో ముందుగా త‌న ప‌ర్య‌ట‌న ఉండాలి అనే దానిపై ఒక స్ప‌ష్ట‌త రానుంది. ఈక్ర‌మంలోనే జిల్లాలో రెండు రోజుల‌పాటు ఉండేందుకు ఆయ‌న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్ల‌మెంట్ యూనిట్‌గా తీసుకుని ఆపార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే, సీమ జిల్లాల్లోని నాలుగు జిల్లాల్లో ఏ జిల్లా నుండి ఈ జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంభించాల‌నే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో జిల్లాల ప‌ర్య‌ట‌న‌

ఇక జిల్లాల ప‌ర్య‌ట‌న వాస్త‌వంగా జ‌న‌వ‌రి మూడు, నాలుగో వారాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇది కాస్త దూరం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 3,4 తేదీల్లో కీల‌క నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన త‌రువాత ఆవెంట‌నే ఆయ‌న జిల్లాల‌కు బ‌య‌లుదేర‌నున్నారు. అంటే ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఈ ప‌ర్య‌ట‌న దాదాపుగా ఖ‌రారైనట్లు తెలుస్తోంది. ఇక ఈలోగా గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయి క‌మిటీల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాల స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కార్య‌క‌ర్త‌ల‌ను పిలిపించుకుని వారితో ఆయ‌న మ‌మేకం కానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ క‌మిటీలు త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనే విధంగా చూస్తున్నారు. ఈ స‌మావేశాల్లోనే క‌మిటీ నేత‌ల‌కు ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేయ‌బోతున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *