ap news

దుర్భిక్షం లో వ్యవసాయ రంగం..తీవ్ర సంక్షోభంలో రైతులు

ఎంవీఎస్ నాగిరెడ్డి
-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
– రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్
-భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ICAR) మాజీ సభ్యుడు

జూన్ 1 నుండి సెప్టెంబర్ 27 నాటికి మైనస్ -32.92%

వర్షాభావంతో దేశంలోనే తీవ్ర సంక్షోభం

రాయల సీమ రీజియన్ -45.10% లోటు,
కోస్టల్ ఆంధ్ర రీజియన్ -21.64%
సెప్టెంబర్ 7 వరకూ రాష్ట్ర లోటు -55.45%

ఈ పది రోజులలో కోస్టల్ ఆంధ్ర లో వాయుగుండం ప్రభావంతో వర్షం పడటంతో రాష్ట్ర సరాసరి లోటు తగ్గింది
వర్షాలకు ఉత్తరాంద్ర లో వరి, వేరుశనగ, అరటి, కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి.

రైతులను ఆదుకోవవలసిన బాధ్యత ఎవరిది..

ఇంత సంక్షోభం లో ప్రభుత్వం నుండి వచ్చిన సహాయం ఏమైనా ఉందా,

రైతులు ఆలోచించ వలసిన సమయం నడుస్తున్నది..

వ్యవసాయ ఎమర్జెన్సీగా గుర్తించి, ఇప్పటికే చెల్లించవలసిన హామీ ల బకాయిలతో పాటు..రైతులకు తక్షణం ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజి ప్రకటించాలి..

రైతు ఆదాయం పడి పోతుంటే ప్రభుత్వ ప్రకటనలు కాదు.. ప్రత్యక్ష ఆర్ధిక సహాయం అందించాలి..

ఈ సంక్షోభం ప్రభావం దేశం అంతా ఉందా?

దేశ వ్యాప్తంగా 23/9/2026 వరకూ జరగవలసిన మొత్తం సాధారణ సాగులో(అధికారిక డేటాల ప్రకారం) 100.57%(2737.13 లక్షల ఎకరాలు), సరిహద్దు న ఉన్న తెలంగాణా లో 95%(125.61 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 83%(63.24 లక్షల ఎకరాలు) లో మాత్రమే సాగు జరిగినది మొత్తం అన్ని పంటలు కలిపి సాగు జరిగిన ఏరియా తెలంగాణాలో జరిగిన ఏరియాతో పోల్చితే కేవలం 50.34% మాత్రమే మన రాష్ట్రం లో సాగు జరిగినది.

  • వరి జరగ వలసిన సాగు లో దేశ వ్యాప్తంగా 104.59%(1065 లక్షల ఎకరాలు), తెలంగాణాలో 56. 58 లక్షల ఎకరాలు సాగు జరిగితే, ఆంధ్రప్రదేశ్ లో 32.86 లక్షల ఎకరాలు మాత్రమే సాగు జరిగినది.
  • పప్పు ధాన్యాలు జరగ వలసిన సాగు లో దేశ వ్యాప్తంగా 95.81%(298 లక్షల ఎకరాలు ), తెలంగాణా లో 122%(7.95 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 110%(9.41 లక్షల ఎకరాలు) సాగు జరిగినది.
  • ప్రత్తి జరగ వలసిన సాగు లో దేశ వ్యాప్తంగా 87.44%(271.17 లక్షల ఎకరాలు), తెలంగాణా లో 102%(48.33 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 85%(10.80 లక్షల ఎకరాలు) సాగు జరిగినది.
  • మొక్క జొన్న జరగ వలసిన సాగు లో దేశ వ్యాప్తంగా 115.17%(229.85 లక్షల ఎకరాలు), తెలంగాణా లో 96%(5.93 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 80%(3.1లక్షల ఎకరాలు) సాగు జరిగినది.
  • వేరుశనగ జరగ వలసిన సాగు లో దేశ వ్యాప్తంగా 108.68%(125.65 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 43%(4.13 లక్షల ఎకరాలు) సాగు జరిగినది.
  • వేరు శనగ, ప్రత్తి సాగు సమయం అయి పోయినది. ఆంధ్రప్రదేశ్ లో సాగు జరిగిన ఈ రెండు పంటలు, పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, చిరు ధాన్యాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
  • సెప్టెంబర్ 27 నాటికి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా సాధారణ వర్ష పాతం నమోదు అయినది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం -32.92% లోటు వర్ష పాతం నమోదు అయినది
  • ఇందులో 3 జిల్లా లు-50% కంటే పైన .. అన్నమయ్య -63.12%, శ్రీ సత్య సాయి 56.10%, ప్రకాశం -56.75%
  • 5 జిల్లాలు -40% నుండి 49% ..
  • +19% నుండి -19% వరకూ సాధారణం(averege). -20% నుండి -59% వరకూ లోటు(deficit) -60% తీవ్ర లోటు(Scanty) వర్ష పాతం..
  • దేశ వ్యాప్తంగా చూస్తే అత్యధిక లోటు వర్ష పాతం, సాగు సంక్షోభం ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నట్లు అధికారిక డేటాలే చెబుతున్నాయి..

నాలుగు జిల్లాల్లో కేవలం  23.75 లక్షల ఎకరాలు (37.57%) సాగు..

కర్నూలు 8.92, అనంతపురం 6.86,నంద్యాల 4.86, శ్రీ సత్య సాయి 3.11 లక్షల ఎకరాలలో సాగు జరిగినది. ఇది అంతా కూడా వర్షాధారంగా సాగు చేసే మెట్ట పంటలే. ఈ నాలుగు జిల్లాలలో జూన్ నెలలో కొంత వరకు వర్షాలు పడి సాగు జరిగినది. కానీ జులై, ఆగష్టు నెలలు తీవ్ర వర్షా భావం తో పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

-ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పూలు, ఆక్వా, పొగాకు ఉత్పత్తి లో అగ్ర స్థానం లో ఉండే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇంతటి సంక్షోభమా???

వీరిని ఆదుకో వలసిన బాధ్యత ఎవరిది..?
ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న ఉప శమన చర్యలు ఏమైనా ఉన్నాయా..?
రైతులు ఆలోచించ వలసిన సమయం నడుస్తున్నది.

  • గోదావరి, పెన్నా డెల్టాలు తప్ప ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొంటోంది. వర్షపాతం తీవ్ర లోటు, సాగునీటి వనరుల వినియోగం పై సరి అయిన ప్రణాళిక లేకపోవడం, భూగర్భజలాలు పడిపోవడం, పంటల సాగు ఆలస్యం కావడం, సాగు జరిగిన పంటలు దెబ్బ తినటం వంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభం లోనికి నెట్టాయి..
  • కృష్ణా నది పై ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సాగు కు నీరు వాడుకుంటున్నారు. కానీ మన రాష్ట్రం లో మాత్రం సాగుకు నీరు విడుదల చెయ్య లేదు.
  • 23/9/2026 నాటికి వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 76.2 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు అంచనా కు గాను 63.24 లక్షల ఎకరాలు (83%) సాగు జరిగినది. కానీ అత్యధికం గా సాగు దెబ్బ తిన్న పంటలు వర్షాధారం పై సాగు జరిగిన వేరుశనగ, ప్రత్తి, పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, చిరుదాన్యలే..
  • నీటి వనరుల క్రింద 32.86 లక్షల ఎకరాల లో సాగు జరిగిన వరి కంటే ఎక్కువ ఈ పంటలే తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
  • రాష్ట్రం లో ఖరీఫ్ లో అత్యధికంగా సాగు జరిగే పంట వరి. సీజన్లో జరగ వలసిన వరి సాధారణ సాగు *37.41 లక్షల ఎకరాల కు గాను 32.86 (88%) లక్షల ఎకరాలు సాగు జరిగినది. మొత్తం జరిగిన సాగు లో 52.% వరి మాత్రమే.
  • వర్షా ధారం పై.. 9.41లక్షల ఎకరాలలో సాగు జరిగిన పప్పు ధాన్యాలు, సాగు *10.80 లక్షల ఎకరాల లో జరిగిన ప్రత్తి, సాగు 3.1 లక్షల ఎకరాల లో జరిగిన మొక్క జొన్న, 4.13 లక్షల ఎకరాలలో సాగు జరిగిన వేరుశనగ..
    జొన్న, సజ్జ, రాగి, ఆముదం పంటలు, తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.
    అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల లలో సాగు జరిగి, అనకాపల్లి, బాపట్ల , పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, పోలవరం, మార్కాపురం జిల్లాలలో సాగు జరగక తీవ్రంగా ఈ వర్షా భావానికి రైతులు నష్ట పోయారు.
    జూన్ లో కురిసిన వర్షానికి రైతులు ఈ పంటలు సాగు చేసి జులై, ఆగష్టు మొత్తం వర్షా భావం మూలంగా తీవ్రంగా నష్ట పోయారు.
  • రాష్ట్రం లో జరిగిన సాధారణ సాగు 83% కంటే తక్కువ సాగు జరిగిన విశాఖపట్నం 51%,అనకాపల్లి 36%, ఏలూరు 76%, NTR 78%, బాపట్ల 67%, పల్నాడు 66%, ప్రకాశం 27%, చిత్తూరు 36%, వైస్సార్ కడప 60%, అన్నమయ్య 33%, శ్రీ సత్య సాయి 64%, మార్కాపురం 37%, పోలవరం 38% మాత్రమే సాగు జరిగిన జిల్లాలలో కూడా రైతులు భూమి ని దుక్కి దున్ని, భూమిలో ఎరువు వేసి, కొన్ని ప్రాంతాలలో కవులు చెల్లించి కొంత పెట్టుబడి పెట్టేసి ఉన్నారు..
  • ప్రభుత్వం వరి సాగు చెయ్యవద్దు, వర్షధార పంటలు సాగు చెయ్యమని పదే పదే మాట్లాడుతున్నది. 23/9/2026 నాటికి రాష్ట్రం మొత్తం *63.24 లక్షల ఎకరాలలో అన్ని పంటలు కలిపి సాగు జరిగితే అందులో 32.86 లక్షల ఎకరాలు 52% వరి పంట మాత్రమే.
    అంటే రాష్ట్రం ఖరీఫ్ లో వరే ప్రధాన పంట.
    అంటే ఖరీఫ్ లో వరి సాగు చేసే ప్రాంతాలలో ప్రాథ్యామ్నాయ పంటలు సాధ్యం కాదు అని అర్ధం అవుతున్నది.

రాష్ట్రం లో దెబ్బ తిన్న పంటలన్నీ వర్షాధారమే..

రాష్ట్రం లో గత రెండు సంవత్సరాలుగా కూడా వాతావరణ ప్రతికూలతలు, అకాల వర్షాలు, వర్షాభావం, పంటల దిగుబడి తగ్గుదల, అనేక పంటలకు కనీస మద్దత్తు ధరలు కూడా దక్కక పోవడం తో వేల కోట్లు నష్ట పోయి రైతులను తీవ్రంగా ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్నాయి. రైతుకు పెట్టుబడి పెరిగింది..ఆదాయం మాత్రం పడిపోయింది..

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, డీజిల్, సాగునీటి ఖర్చులు నిరంతరం పెరుగుతున్నాయి. మరోవైపు వర్షాభావం కారణంగా పంటలు సరిగా సాగకపోవడం, దిగుబడులు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో సాగైనా పంటలు పూర్తిగా దెబ్బతినడం, ఆ పండిన పంటలకు కూడా ధరలు లేక రైతుల ఆదాయం తీవ్రంగా పడిపోయింది.

జులైలో 67.9%, ఆగస్టులో 55.9% తీవ్ర లోటు వర్ష పాతం నమోదైనందున, జూన్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకూ రాష్ట్రం లో -55% పైగా లోటు లో ఉండి పంటలు దెబ్బ తిన్నందున రాష్ట్రాన్ని వ్యవసాయ ఏమర్జెన్సీ ప్రకటించి కాగితాలపై ఉన్న నిబంధనలు కాకుండా, నిజంగా నష్టపోయిన ప్రతి రైతుకు కరువు పరిహారం అందించే లా ప్రభుత్వం ప్రత్యేక సహాయం ప్రకటించాలి.

ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు

-వర్షాభావం వల్ల పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు, సాగు చెయ్యలేని రైతులకు ఎకరాకు 15 వేలు తగిన స్థాయిలో ప్రత్యేక కరువు పరిహారం ప్రకటించాలి.

-వర్షా భావం తో చనిపోతున్న పండ్ల తోటలకు 80% సబ్సిడీ తో ట్యాంకర్ ల ద్వారా నీరు ప్రాణాధార తడులకు అందించాలి.

పంటలు దెబ్బ తిన్న ప్రాంతాలలో 75% సబ్సిడీ పై విత్తనాలు ఇప్పుడు సాగుకు అందించాలి.
ఉచితంగా పశువులకు పశు గ్రాసం, గ్రామాలకు త్రాగు నీరు అందించాలి.

కరువు మూలంగా వలసలు నిరోదించటానికి అక్టోబర్ 1 నుండి 150 రోజులు కరువు పనులు కల్పించి చనిపోయిన పండ్ల తోటలు, ప్రత్తి తొలగింపు, రబీ సేద్యానికి అను సంధానం చెయ్యాలి

ఉత్తరాంద్రలో వాయుగుండం ప్రభావంతో అధిక వర్షాలకు దెబ్బతిన్న వరి, మొక్క జొన్న, అరటి, కూరగాయల పంటలను వెంటనే ఎన్యుమరేట్ చేసి పరిహారం అందించాలి
.
రాష్ట్రం మొత్తం పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలు, సున్నా వడ్డీ రాయితీ బకాయి, హామీ ఇచ్చిన ప్రకారం అన్నదాతా సుఖీభవ బకాయి, ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి.

రైతులకు ఎంతో ఉపయోగ పడిన ఉచిత పంటల బీమా పథకం అమలు చెయ్యాలి.

ఈ సంక్షోభంలో పెద్ద ఎత్తున కౌలు రైతులు నష్ట పోతున్నందున ప్రభుత్వం ఇచ్చిన హామీ ల మేరకు ప్రయోజనాలు కవులు రైతులకు అందించాలి.

సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా అత్యవసర సాగునీటి ప్రణాళిక అమలు చేయాలి.

రైతును ఆదుకుంటేనే వ్యవసాయం నిలుస్తుంది..
వ్యవసాయం నిలిస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలుస్తుంది

రైతుకు న్యాయం చేయడం దయ కాదు..ప్రభుత్వ బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *