వామపక్ష అభ్యర్ధులను గెలిపించండి

ఆర్ ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాములు పిలుపు
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పి), సీపీఐ, సీపీఎం అభ్యర్ధులకు ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. స్థానిక సంస్థలు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే నాయకత్వానికి ఎన్నికల్లో అవకాశం కల్పించాలి..ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు ప్రజల ముందుకు వస్తున్నారని రాములు తెలిపారు.
