గుంటూరులో తుపాకులు,బుల్లెట్లు కలకలం

నకిలీ ధృవ పత్రాలతో అక్రమ ఆయుధాలు, బుల్లెట్లు పొందిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు తాడికొండ కి చెందిన విజయహర్ష గా గుర్తింపు
22 రైపిల్,ఒక బోర్ షాట్ గన్,ఒక పిస్టల్ 50 బుల్లెట్లు, కారు స్వాధీనం
నిందితుడు చిత్తూరు జిల్లాలోని శాప్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విజయ హర్షగా గుర్తించిన పోలీసులు..జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటివరైనా వదిలేదిలేదంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ వకుల్ జిందాల్..ఫోర్స్ షూటింగ్ కోసం అంటూ ధ్రువ పత్రాలు తీసుకొన్నట్లు తెలిపిన ఎస్పీ వకుల్ జిందాల్.
- విజయవాడ లోని ఓ షాపింగ్ మాల్ లో మిస్ ఫైర్ అయిన ఘటనలో నిందితుడు విజయహర్ష కోసం చాలా రోజులుగా గాలిస్తున్న పోలీసులు
- అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆయుధాలు పొందిన విజయ హర్షను అరెస్ట్ చేసిన నగరం పాలెం పోలీసులు
- నిందితుడు పైఅక్రమ ఆయుధ చట్టం 318(4)336(3)Bns సెక్షన్ 25(1) కింద కేసు నమోదు
పొన్నెకల్లు గ్రామంలోని ఒక వెంచర్ లో తుపాకులతో నిందితుడు ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం అందినట్లు తెలిపిన ఎస్పీ వకుల్ జిందాల్ ..
