ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..సుబ్బారావు గుప్తా
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక పేరుతో సుబ్బారావు గుప్తా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోందనీ, న్యాయంగా వారికి అందాల్సిన జీపీఎఫ్, టీఏ, డీ, డీఏ, ఏపీజీఎల్ ఐ తదితర ప్రయోజనాలను సమకూర్చకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి..తక్షణం పెండింగ్ నిధులను విడుదల చేయాలి..సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లకు కార్మిక చట్టాల ప్రకారం నెలకు రూ 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫేస్ రికగ్నైజన్ పేరుతో ఉద్యోగులను వేధింపులకు గురిచేసే విధానాలు మానుకోవాలన్నారు.