వైసీపీ ఆరిపోయే దీపం..టైమ్ దగ్గర పడింది..
గిద్దలూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.. ఇదీ ఆయన ప్రసంగం..
• వైసీపీ ఆరిపోయే దీపం…..ఎక్సైపైరీ డేట్ దగ్గర పడింది.
• నాలుగేళ్లలో ఒక్క పని చేశారా…మీ జీవితాల్లో వెసులుబాటు, వెలుగు వచ్చిందా…
• ఈ వైసీపీ పాలన వల్ల కష్టాలు….బాధలు తప్ప ప్రజలకు ఏమి మిగిలింది?
• జగన్ ప్రభుత్వం వల్ల బాదుడే బాదుడు…వీర బాదుడు.
• నిత్యావసర వస్తువులు సహా అన్ని ధరలు పెరిగాయి
• అన్ని ధరలు పెరిగాయి…పెరగనిది ప్రజల ఆదాయం ఒక్కటే
• పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచాడు
• ఇవన్నీ చాలవు అన్నట్లు ఆర్టీసీ రేట్లు, ఇంటి పన్నులు పెంచాడు.
• చెత్త మీద కూడా పన్నేసిన చెత్త సిఎం ఈ వైఎస్ జగన్
• ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక బంగారంగా మారింది. వైసీపీ నేతలకు వరంగామారింది.
• మద్యం ధరలు భారీగా పెరిగాయి…..కొత్త కొత్త బ్రాండ్ల మద్యం తెచ్చారు. అన్నీ జె బ్రాండ్లే. జగనే తయారు చేస్తాడు..జగనే అమ్ముతాడు
• తోపుడు బండ్ల వద్ద కూడా ఆన్లైన్ లో డబ్బులు పే చేస్తున్నారు…మరి మద్యం షాపుల్లో ఎందుకు ఆన్లైన్ లో చెల్లింపులు తీసుకోవడం లేదు
• మద్యం అమ్మకాల డబ్బు…..తాడేపల్లి ఇంటికి పోతుంది
• పేదల ఆరోగ్యం కూడా లెక్కబెట్టకుండా ఇష్టానుసారం చేస్తున్నారు
• జగన్ బటన్ నొక్కుడు కాదు….అక్రమాలతో బొక్కుడు
• అధికారంలోకి వచ్చాక జగన్ రూ. 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించాడు
• రాష్ట్ర ప్రజలపై రూ. 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల భారంమోపాడు
• ప్రతి వ్యక్తిపై రెండు లక్షల అప్పులు తెచ్చాడు. ఈ అప్పులు ఎవరు కట్టాలి…ప్రజలే కదా కట్టాల్సింది
• విద్యా వసతి ఎత్తిపోయింది….డబ్బులు లేవంట.
• పోలీసులకు డిఎలు లేవు…..వారి గురించి కూడా నేనే మాట్లాడాలి
• కష్టపడి డ్యూటీ చేసే పోలీసులకు, ప్రజలకు సేవలు చేసే ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు
• ఒకప్పుడు జీతాలు పెంచమని చెప్పిన ఉద్యోగులు….ఇప్పుడు జీతాలు ఇస్తే చాలు అంటున్నారు.
• అవినీతిలో సిద్దహస్తుడు జగన్ మోహన్ రెడ్డి,.తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని రూ. 43 వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడు అని సిబి ఐ తేల్చింది.
• సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కాదు పోలీసులు జైల్లో పెట్టాల్సింది.
• బాబాయిని చంపిన వారిని, కోడికత్తి డ్రామా ఆడిన వారిని జైల్లో పెట్లాలి
• వివేకా హత్యలో అవినాష్ ను కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్
• నాడు గుండెపోటు అన్నారు…రక్తపు వాంతులు అన్నారు…..ఎవరు కుట్లు వేశారు.
• నాడు సిబిఐ విచారణ కావాలి అన్నాడు….తరువాత వివేకా కేసులోనే మళ్లీ సిబిఐ విచారణ అవసరం లేదు అన్నాడు
• వివేకా కేసు పోలీసులకు, హంతకులకు, న్యాయవాదులకు కూడా ఒక కేస్ స్టడీ
• పశ్చిమ ప్రకాశంలో కరువు నివారణకు నేనే శంకుస్థాపన చేశాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నామమాత్రంగా పనిచేశాయి
• 2014లో మళ్లీ సిఎం అయిన తరువాత ప్రాజెక్టుపై కేసులు పరిష్కరించి పనులు పరుగులు పూర్తి చేశాను.
• 2019 నాటికి 95 శాతం పనులు పూర్తి చేశాను. 5 శాతం పనులు పూర్తి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతాడా
• వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వమే. మొదటి ప్రాధాన్యత కింద వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను
• వెలిగొండ పూర్తి అయితే సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది.
• పోలవరం ప్రాజెక్టును జగన్ గోదావరిలో కలిపేశాడు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 కే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేది
• నదుల అనుసంధానం జరిగి ఉంటే రాయలసీమ కు లబ్ది జరిగేది.
• గోదావరి నీళ్లు పెన్నా నదికి తీసుకువెళ్లే అవకాశం ఉండేది.
• నదుల అనుసంధానంతో పశ్చిమ ప్రకాశం సస్యశాసమలం అయ్యేది
• పోలవరంపై ప్రాజెక్టుపై రివర్స్ టెండర్ అని రివర్స్ చేసి గోదాట్లో కలిపారు.
• ఇప్పుడు అదనపు ఖర్చు అంటూ రూ.2 వేల కోట్లు అవుతుంది.
• జగన్ అసమర్థత వల్లనే ఈ అదనపు ఖర్చు పడింది.
• పెట్టుబడులు వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు….పెట్టుబడులు రాకుండా బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి.
• జాబు కావాలి అంటే….బాబు రావాలి అని ప్రజలే అంటున్నారు
• చదువుకున్న తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది.
• ఈ ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా…ఒక్కడికి అయినా ఉద్యోగం ఇచ్చాడా
• జగన్ ఇచ్చింది ఒక్కటే ఉద్యోగం…అదే వాలంటీర్ ఉద్యోగం
• నేను ఐటీ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను….ఇప్పుడు మటన్ కొట్లో, ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు
• ఇప్పుడు జగన్ భవిష్యత్ అని చెపుతున్నాడు…జగన్ మీ బిడ్డ కాదు…జగన్ సమాజాన్ని పట్టి పీడుతున్న క్యాన్సర్
• జగనే మీ నమ్మకం కాదు…జగనే రాష్ట్రానికి దరిద్రం
• జగన్ ఒక ఐరన్ లెగ్…ఒక సైతాన్ గా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడు
• నాలుగేళ్లు దాటింది….ఇంకో 6 నెలల్లో జగన్ ఇంటికిపోతాడు. ఏం చేశాడో చెప్పగలడా?
• నేను నాడు హైటెక్ సిటీ కట్టాను….సైబరాబాద్ నిర్మాణం చేశాను. జీనోమ్ వ్యాలీని ప్రారంభించింది తెలుగు దేశం పార్టీ.
• హంద్రీ నీవా , గాలేరునగరి ప్రారంభించింది, పనులు చేసింది టీడీపీ
• హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని రూపకల్పన చేశాను.
• జగన్ ఇంటికి పోయే సమయం వచ్చింది….ఇడుపుల పాయకు వెళ్లాల్సిన జగన్…ఇప్పుడు విశాఖ పోతాను అంటున్నాడు.
• రాజధాని సుప్రీం కేసులో ఉంటే సెప్టెంబర్ లో విశాఖ పోతాను అని జగన్ చెపుతున్నాడు
• జగన్ వస్తాడు అంటే విశాఖ ప్రజలు భయపడుతున్నారు
• పులివెందులకు బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి స్టీల్ ప్లాంట్ కడతాడా
• రామాయపట్నం పోర్టుకు నాడు ఫౌండేషన్ వేస్తే…దాన్ని పూర్తి చెయ్యలేదు
• భావనపాడు పోర్ట్ ను టీడీపీ తలపెడితే…..ఇప్పుడు జగన్ దానికి ఫౌండేషన్ వేశాడు
• బందరు పోర్టుకు మేం పనులు ప్రారంభిస్తే….జగన్ ఇంటికి పోయే సమయంలో మళ్లీ శంకుస్థాపన అంటున్నాడు
• కియా మోటార్స్ ను తీసుకువచ్చి 13 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి….15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను.
• ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తాను అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి
• మద్యం ధరలు పెరిగాయని….చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు
• యువకులు గంజాయికి అలవాటు పడడం అనేది చాలా ప్రమాద కరం. సిఎం గంజాయిపై ఒక్క రోజు సమీక్ష చేశాడా….
• చివరికి తిరుమల దేవస్థానంలో కూడా గంజాయి దొరుకుతుంది అంటే ఏమి చెప్పాలి
• వెంకటేశ్వర స్వామిని అప విత్రం చేసిన ఏ వ్యక్తిని ఆ స్వామి వదలిపెట్టడు
• జగన్ కొత్త నాటకంతో మీ దగ్గరికి వస్తున్నాడు…ఆయన పేదల ప్రతినిధి అని చెపుతున్నాడు.
• ఎడిఆర్ అనే సంస్థ నివేదిక ప్రకారం జగన్ ఆదాయం రూ.510 కోట్లు.. 29 మంది ముఖ్యమంత్రుల కంటే జగన్ ఆస్తి ఎక్కువ
• జగన్ పేదల కోసం పనిచేసే వ్యక్తి కాదు…పేదల రక్త తాగే వ్యక్తి
• సంక్షేమానికి చిరునామా తెలుగు దేశం పార్టీ…రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది, అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా ఇచ్చింది టీడీపీ
• ఇదే నియోజకవర్గానికి చెందిన రమేష్ అనే సర్పంచ్ చెప్పుతో కొట్టుకున్నాడు. జగన్ కు ఓటేసినందుకు బాధపడుతున్నా అన్నాడు
• నాడు వైసిపినీ నమ్మి మోసపోయాను అని ఒక ముస్లిం సోదరుడు వచ్చి నేడు కలిశాడు. టీడీపీకి రూ.50 వేల ఫండింగ్ కూడా ఇచ్చాడు. టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ది అని చెపుతున్నాడు
• జగన్ ఒక స్టిక్కర్ సిఎం. మీ ఇంటికి ఆయన స్టిక్కర్ ఏంటి. జగన్ ఇంటికి వెళ్లి మనం స్టిక్కర్ వేస్తే వేయనిస్తారా
• మన ఇంటికి రావడానికి వైసీపీకి ఏం అర్హత ఉంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు వేస్తే కాళ్లు విరగొట్టినా కేసుల లేదు
• జగన్ పని అయిపోయింది….వైసీపీ గెలవదు.
• అమరావతి అనంతపూర్ ఎక్స్ ప్రెస్ వే గిద్దలూరు మీదుగా వెళ్లేది. దాన్ని కూడా నిలిపివేశాడు.
• ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. మార్కాపురం కేంద్రంగా జిల్లా కేంద్రం కావాలని.
• టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం.
• గిద్దలూరు అభివృద్ది రూ. 1370 కోట్లు నాడు మంజూరు చేశాను. ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు నిధులు ఇచ్చాను.
• మీ గ్రామాల్లో వైసీపీ వచ్చిన తరువాత ఒక్క పని అయ్యిందా
• గిద్దలూరు లో తాగునీటికి 90 కోట్లు, నియోజకవర్గానికి సుంకేసుల నుంచి తాగునీరు ఇచ్చేందుకు మంజూరు చేసిన 350 కోట్లు రద్దు చేశారు.
• రాచర్ల రైల్లే బ్రిడ్జ్ కోసం ఇక్కడ డిమాండ్ ఉంది. ఆసమస్యను కూడా పూర్తి చేస్తాం
• సగిలేరు ముంపు నివారణకు మంజూరు చేసిన నిధులను కూడా రద్దు చేశారు.
• అశోక్ రెడ్డి ఎప్పుడు వచ్చినా గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ది గురించి నిధులు అడిగేవాడు
• స్థానిక ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. అలాంటి అహంకారులు ఈ వైసీపీ నేతలు
• ఈ ప్రాంతంలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా
• పనులు చేసిన రెడ్లకు బిల్లులు ఇచ్చాడా…వారికి ప్రత్యేకంగా ఏమైనా చేశాడా
• షెడ్యూల్ కులాలను ఊచకోత కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం
• పుట్టిన రోజున ప్రజల మధ్యన ఉండాలి అని ఈ వెనుకబడిన ప్రాంతంలో నేను పర్యటన పెట్టుకున్నా
• తెలుగు దేశం జెండా…పేదవారికి అండ. రాష్ట్రానికి రక్షణ.
• ప్రజలంతా తిరుగుబాటు చేసి జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి
• ఈ రోజు గిద్దలూరు గర్జించింది. మీరు అండగా ఉంటే కొండను అయినా బద్దలు చేస్తాను.