ఒంగోలు మేయర్ అన్ రిజర్వ్ డ్

మంగళగిరి-తాడేపల్లి మేయర్ ఎస్టీలకు..
గుడివాడ బీసీ మహిళ..రాజమహేంద్రవరం, కర్నూలు ఎస్సీలకు…

మహిళలకు 9 నగరపాలక సంస్థల్లో మేయర్లుగా అవకాశం

పురపాలక సంఘాల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 మహిళలకు 50% కేటాయింపు

నేడు విడుదల కానున్న జాబితా

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై పురపాలక శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తయింది. 17 నగరపాలక సంస్థలు, 106 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై దాదాపు ఒక నిర్ణయానికి రాగా.. తుది కసరత్తు కొనసాగుతోంది. నిబంధనలు, జనాభా నిష్పత్తి, రొటేషన్ తదితర అంశాల ఆధారంగా అన్నీ సరిగా ఉన్నాయో లేదో అధికారులు సరిచూస్తున్నారు. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి దాదాపు కొలిక్కి వచ్చింది. సోమవారం నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల వారీగా రిజర్వేషన్ల జాబితా విడుదల చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ పదవిని ఎస్టీలకు.. రాజమహేంద్రవరం, కర్నూలు నగరపాలక సంస్థలను ఎస్సీలకు కేటాయిస్తున్నారు.

123 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 41 కేటాయించనున్నట్లు తెలిసింది. మొత్తం 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 దక్కనున్నాయి. మహిళలు 50% కంటే ఎక్కువగా.. అంటే 9 మంది మేయర్లు కానున్నారు. 106 పురపాలక సంఘాల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 కేటాయిస్తున్నారు. ఇందులో 50% చోట్ల మహిళలకు ఛైర్పర్సన్ పదవులు దక్కనున్నాయి. తుది కసరత్తులో భాగంగా ఏవైనా లోపాలు దొర్లితే వాటిని సరిచేసే క్రమంలో ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది.

నగరపాలక సంస్థల్లో నాలుగు.. మళ్లీ మహిళలకే

మొత్తం నగరపాలక సంస్థల్లో నాలుగు చోట్ల మళ్లీ మహిళలకే అవకాశం కల్పించనున్నారు. కాకినాడ, మచిలీపట్నం కార్పొరేషన్లను 2021 ఎన్నికల్లో జనరల్ మహిళలకు కేటాయించగా.. ఈ దఫా బీసీ మహిళలకు అవకాశం దక్కనుంది. 2021 ఎన్నికల్లో బీసీ మహిళలకు కేటాయించిన విజయనగరం, శ్రీకాకుళం కార్పొరేషన్లను ఈ దఫా జనరల్ మహిళలకు కేటాయిస్తున్నారు.

నగరపాలక సంస్థల రిజర్వేషన్లు

ఎస్టీ (1) – జనరల్: మంగళగిరి

ఎస్సీ (2) – మహిళ: కర్నూలు, జనరల్: రాజమహేంద్రవరం

బీసీ (5) – మహిళలు: కాకినాడ, మచిలీపట్నం, జనరల్: ఏలూరు, అనంతపురం, చిత్తూరు

మహిళలు (5) – జనరల్: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్

ఆన్ రిజర్వ్ డ్ (4) – తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు.

పురపాలక సంఘాలు: 106..

ఎస్టీ: 3 – మహిళ (1): గూడూరు, జనరల్ (2): ఆలూరు, ఆత్మకూరు

ఎస్సీ: 14 – మహిళలు (7): చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల; జనరల్ (7): ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల

బీసీ (36) – మహిళలు (18): చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం; జనరల్ (18): కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు

జనరల్ మహిళ (27): కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు

అన్ రిజర్వ్డ్ (26): సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి

ముందే చెప్పిన andhraavani.net 

ముందే చెప్పిన andhravani.net..ఉత్తర్వులు జారీ చేసిన పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *