ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం (జులై 14 సాయంత్రం) తుది శ్వాస విడిచారు. గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లో నిష్కళంక నాయకునిగా ఆయనకు పేరుంది.
