ap news

వర్షాలు.. అప్రమత్తం

మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో రాజస్థాన్ , గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో సోమవారం (14-09-2026) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం ఉదయం 8:30గంటల నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు కృష్ణా జిల్లా పెనమలూరులో 100.2మిమీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 97.6మిమీ, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 94.2మిమీ, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 90.8 మిమీ, బాపట్ల జిల్లా మార్టూరులో 90.6మిమీ, కోనసీమ జిల్లా అయినవిల్లిలో 89.6మిమీ, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 88.4మిమీ, ప్రకాశం జిల్లా అద్దంకిలో 85.4మిమీ, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 84.6మిమీ, గుంటూరు పశ్చిమలో 84.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని వివరించారు.

ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా మెట్టక్కివలసలో 34.1మిమీ, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 33మిమీ,నర్సన్నపేటలో 32.2మిమీ, విజయనగరం జల్లా మల్లంపేటలో 31.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 31మిమీ వర్షపాతం రికార్డైందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *