అర్న‌బ్ తుపాన్‌పై స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

  • నిరంత‌రం సమీక్షిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, హోం మంత్రి అనిత‌
  • ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నానికి 215 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన తుపాన్‌
  • రేపు ఉద‌యం యానం వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లు
  • తీరం వెంబ‌డి ఎగ‌సిప‌డుతున్న స‌ముద్ర‌పు కెర‌టాలు
  • స‌ముద్ర‌పు అల‌లు 1 నుంచి 2 మీట్ల ఎత్తు వ‌ర‌కు ఎగ‌సి ప‌డే అవ‌కాశం
  • ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు
  • 14 జిల్లాల‌కు 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 10ఎస్డీఆర్ ఎఫ్ ద‌ళాల‌ను స‌హాయ చ‌ర్య‌ల కోసం త‌ర‌లింపు
  • 20 జిల్లాల్లో 2,131 తుపాన్ షెల్ట‌ర్ ప్రాంతాల ఏర్పాటు
  • 18 జిల్లాల్లో 2.70 కోట్ల మంది మొబైల్ ఫోన్ల‌కు నిరంత‌రం తుపాన్ హెచ్చ‌రిక‌లు జారీ
  • తీరాల్లో నిలిచిపోయిన 30,043 ఫిషింగ్ బోట్లు
  • తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో 1,087 వైద్య బృందాల ఏర్పాటు
  • 8,281 అత్య‌వ‌స‌ర ప‌డ‌క‌లు, 1,274 అంబులెన్సులు సిద్ధం చేసిన అధికారులు
  • పాముకాటు బారీ నుంచి ర‌క్షించేలా ఆసుప‌త్రుల్లో 21,536 యాంటీ స్నేక్ వీన‌మ్‌లు సిద్ధం చేసిన యంత్రాంగం
  • 1,351 మంది గ‌ర్భిణిల‌ను ఇప్ప‌టికే ఆసుప‌త్రుల‌కు స‌ర‌క్షితంగా త‌ర‌లింపు
  • 2,613 మంచినీళ్ల ట్యాంక‌ర్లు, 2,430 జ‌న‌రేట‌ర్లు, 4,448 ఆర్వో ప్లాంట్లు సిద్ధం చేసిన అధికారులు
  • 14,686 రేష‌న్ దుకాణాల్లో రెండు నెల‌ల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌రాల నిల్వ‌లు ముంద‌స్తుగానే నిల్వ చేసిన యంత్రాంగం
  • త‌మ పంట‌లకు న‌ష్టం వాటిల్ల‌కుండా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని 35.96 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సూచ‌న‌లు జారీ
  • ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌పై నింత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌. 419 గిరిజ‌న హాస్ట‌ళ్ల‌పై ప్ర‌త్యేక దృష్టి.
  • హాస్ట‌ళ్ల‌లో ఉంటున్న 88,083 మంది విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ముంద‌స్తు ఏర్పాట్లు
  • 550 జేసీబీలు, 596 ఎల‌క్ట్రిక్ రంపాలు సిద్ధం చేసిన రోడ్లు భ‌వ‌నాల శాఖ
  • 1,079 జ‌లాశ‌యాల వ‌ద్ద ప‌రిస్థితి నిరంత‌రం స‌మీక్షిస్తున్న అధికారులు
  • ఆర్టీజీఎస్ నుంచి జిల్లాల్లో ప‌రిస్థితిని 24/7 ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారులు
  • జిల్లాల్లో చేప‌ట్టిన తుపాన్ ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త ఏర్పాట్ల‌ను నిరంత్యం స‌మీక్షిస్తున్న ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు
  • తుపాన్ ప్ర‌భావిత జిల్లాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని జిల్లాల యంత్రాంగానికి చేర‌వేస్తున్న ఆర్టీజీఎస్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *