పద్యాన్ని మానవీయం చేసిన మధురకవి

జానుడి ఆధ్వర్యంలో ఒంగోలులో మధురకవి మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలు
పద్యానికి మానవీయతను జోడించిన మధురకవి మల్లవరపు రాజేశ్వరరావు అని జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ అధ్యక్షుడు వై . విజయకుమార్ పేర్కొన్నారు. జానుడి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని జానుడి సాహిత్య కేంద్రంలో రాజేశ్వర రావు గారి వర్ధంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి న్యాయవాది ఆడే రామ సుబ్బారావు అధ్యక్షత వహించగా విజయకుమార్ రాజేశ్వర రావు గారి సాహిత్య కృషి గురించి వివరించారు. ఈ సందర్భంగా న్యాయవాది డాక్టర్ నూక తోటి రవికుమార్ మతసామరస్యం మీద రాజేశ్వరరావు గారు రచించిన పద్యాన్ని జానుడి ట్యూషన్ సెంటర్ విద్యార్థుల చేత ఆలాపింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని వై.దుర్గ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

