ప్రజాస్వామ్యంపై చంద్రబాబు దాడి
-
స్థానిక ఎన్నికలను ఏకపక్షం చేసుకునేందుకు కుట్ర
-
మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన జగన్
– ప్రజలకు చేసిన మంచిని చూపించి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు, ఎన్నికల్లో పోటీనే లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
– వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చి ఎన్నికలకు వెళ్లింది.
– గత ఎన్నికల్లో ప్రజలకు చేసిన పనుల ప్రోగ్రెస్ రిపోర్టు చూపించి 86 శాతం స్థానాల్లో విజయం సాధించాం.
– నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై ప్రజలు చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితి ఉంది.
– ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఎన్నికలనే స్వేచ్ఛగా జరగనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలోనూ అదే తంతు
– సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా స్థానిక ఎన్నికల్లో అక్రమాలు ఆగలేదు. అడ్డంకులు మరింత పెరిగాయి.
– మొత్తం 659 మండలాల్లో 101 మండలాల్లో ఎంపీటీసీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
– మరో 70 మండలాల్లో ఐదుకంటే తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి.
– మొత్తం 171 మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల పరిస్థితి తీవ్రంగా ప్రభావితమైంది.
– జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ 659 మండలాలకు గాను 227 చోట్ల నామినేషన్ల ప్రక్రియ పెండింగ్లో ఉంది.
– నామినేషన్ కేంద్రాల వద్ద వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకుండా నిష్పక్షపాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
నామినేషన్ల ప్రక్రియలో ఎనిమిది కుట్రలు
– మొదటి కుట్ర: పోటీ చేయాలనుకునే అభ్యర్థులను పోలీసుల పేరుతో పిలిపించి బెదిరించడం, బైండోవర్ చేయడం, ముందస్తు అరెస్టులకు పాల్పడడం.
– రెండో కుట్ర: అభ్యర్థులకు సహకరించే పార్టీ నాయకులను గృహనిర్బంధం చేసి నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకోవడం.
– మూడో కుట్ర: నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీ శ్రేణులను మోహరించి ప్రతిపక్ష అభ్యర్థులను లోపలికి వెళ్లనివ్వకపోవడం.
– నాలుగో కుట్ర: నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేయడం, అధికారుల ఎదుటే దాడులకు పాల్పడడం.
– ఐదో కుట్ర: దాడులను అడ్డుకోకుండా, బాధితులైన వైయస్ఆర్సీపీ అభ్యర్థులనే కేంద్రాల నుంచి బయటకు పంపించడం.
– ఆరో కుట్ర: దాడులకు గురైన అభ్యర్థులు, వారికి సహకరించిన నాయకులపైనే కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయడం.
– ఏడో కుట్ర: స్క్రూటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించడం, అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్లు చూపించడం.
– ఎనిమిదో కుట్ర: బెదిరింపులు, ఒత్తిళ్లతో అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం.
ఫోర్జరీ సంతకాలతో అభ్యర్థుల తొలగింపు
– నంద్యాల మున్సిపాలిటీలోని 51వ వార్డులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి నాగమణి నామినేషన్ మొదట ఆమోదించిన తర్వాత, ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరణ జరిగినట్లు చూపించారని వైయస్ జగన్ వివరించారు.
– ఆ తర్వాత ఆ వార్డులో టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారని పేర్కొన్నారు.
– నగరిలో వైయస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బాలకృష్ణ నామినేషన్ స్వీకరించి అంగీకార పత్రం ఇచ్చినప్పటికీ, తుది జాబితాలో టీడీపీ అభ్యర్థి పేరే ఉంచారని వివరించారు.
– నామినేషన్ స్వీకరించిన తర్వాత అభ్యర్థిత్వాన్ని తొలగించడం, ఫోర్జరీతో ఉపసంహరణలు చూపించడం ప్రజాస్వామ్య ప్రక్రియపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మహిళా అభ్యర్థులపై దాడులు
– స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత వైయస్ఆర్సీపీ ప్రభుత్వానిదని జగన్ గుర్తుచేశారు.
– స్థానిక సంస్థల్లో సుమారు 80 వేల మంది మహిళలు ఎన్నికయ్యే అవకాశమున్న నేపథ్యంలో, నామినేషన్ల సమయంలో మహిళలపై దాడులు జరగడం దారుణం.
– మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం, దూషించడం, దాడులకు పాల్పడడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?
– మహిళా అభ్యర్థులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెబుతుంది?
చంద్రబాబుకు వైయస్ జగన్ సూటి ప్రశ్న
– “ప్రజలకు మంచి చేసి ఉంటే ఆ మంచిని చూపించి ఓట్లు అడగాలి. నామినేషన్లను అడ్డుకుని, దౌర్జన్యంతో ఎన్నికలను ప్రభావితం చేయడమెందుకు?”
– “పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాల నుంచి ఇప్పుడు నామినేషన్ కేంద్రాల వద్ద అడ్డంకుల వరకు దిగజారడం ప్రజాస్వామ్యమా?”
– “చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరిస్తున్న అధికారులను బాధ్యతల నుంచి తప్పించకుండా నిష్పక్షపాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?”
– “నామినేషన్ల దశలోనే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తే, పోలింగ్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే ఆలోచించాలి.”

