మరో వాయుగుండం
సోమవారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
అండమాన్ పరిసరప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో రేపటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులురూ ఆది,సోమవారాల్లో వాయుగుండంగా రుపాంతరం చెంది ఆ తరువాత 2-3 రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, , రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం నుండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తీరానికి తిరిగిరావాలని హెచ్చరించారు.
శుక్రవారం (23-10-2026) మన్యం , అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

