పరిశోధనాత్మక మార్పులకు ఏపీ ఆహ్వానం

ఆహ్వానిస్తున్న ఆంధ్రప్రదేశ్ 

గోవాలో ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్  లో డాక్టర్ హెచ్. పురుషోత్తం కీలక ఉపన్యాసం

పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల సహకారం, సరికొత్త సాంకేతికతలకు ప్రాధాన్యత

గోవా: విశ్వవిద్యాలయాలను కేవలం సాంప్రదాయ విద్యా కేంద్రాలుగా కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత మరియు సాంకేతిక పురోగతికి నిలయాలుగా మార్చాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖ సెక్రటరీ డాక్టర్ హెచ్. పురుషోత్తం పిలుపునిచ్చారు. గోవా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, గోవాలోని నొవొటెల్ గోవా డోనా సిల్వియా రిసార్ట్‌లో నిర్వహించిన “ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్ 2026” సదస్సులో ఆయన పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించారు.

లీడర్‌షిప్ టు లెగసీ: రీడిఫైనింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్” (నాయకత్వం నుండి వారసత్వం : ఉన్నత విద్య భవిష్యత్తును పునర్నిర్వచించడం) అనే ఇతివృత్తంపై డాక్టర్ పురుషోత్తం ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనలను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చడానికి మరియు డీప్-టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమల (Academia and Industry) మధ్య బలమైన సహకారానికి విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలను ఉన్నత విద్యలో భాగం చేయాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పించే నైపుణ్య ఆధారిత విద్యను అందించాలన్నారు. దేశ సాంకేతిక సామర్థ్యాలను, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి విశ్వవిద్యాలయాలలో బలమైన పరిశోధనా మౌలిక సదుపాయాలు, పేటెంట్ సృష్టి మరియు అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు అవసరమన్నారు. సాంప్రదాయ విద్యా విధానాల పరిధిని దాటి, అర్థవంతమైన పరిశోధనలు మరియు ఆవిష్కరణల ద్వారా సమాజంపై శాశ్వతమైన, సానుకూల ప్రభావాన్ని చూపాలని విద్యాసంస్థలకు డాక్టర్ పురుషోత్తం పిలుపునిచ్చారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

విశ్వవిద్యాలయాలు సాంప్రదాయ బోధనా పద్ధతులను దాటి ముందుకు సాగాలని, అర్థవంతమైన పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా సమాజంపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపాలని ఆయన కోరారు. తద్వారా భారతదేశ సాంకేతిక సామర్థ్యాలను మరియు ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *