తిరుపతిలో డిజిపి, ఐజిపిల సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు.
అమరావతి, ఆంధ్రావని : తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో డిజిపిలు, ఐజిపిల సమావేశాన్ని డిసెంబర్ 4 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. ఈసమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరు కానున్నారు. సమావేశంల ఏర్పాట్లపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఇంటర్ డిపార్టుమెంటల్ కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈసమావేశంలో అదనపు డిజిపి మధుసూదన్ రెడ్డి,హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, కమీషనర్ సెకండరి హెల్తు చక్రధర్ బాబు,ఎస్ఐబి డిప్యూటీ డైరెక్టర్ అంబిక,ఐపిఎస్ అధికారి కాంతి రాణా తాతా తదితర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ గా టిఆర్అండ్బి కార్యదర్శి కె.శశిధర్, తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

