బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం
- రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ఈ నెల 22వ తేదీ రాత్రి తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం గణనీయంగా పెరిగిందని దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి జరగాలని కోరారు. మహిళలపై జరుగుతున్నఅత్యాచారాలు లాంటి దుర్ఘటనలు,
ఘర్షణలకు బహిరంగ మద్య సేవనం ప్రధాన కారణమని వివరించారు.చట్టాలలో మార్పు తెచ్చి బహిరంగ మద్య సేవనం పై కఠిన చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్టం చేయడం ద్వారా నాటుసారా,అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నివారించగలమని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మద్య సేవనాన్ని నివారించగలమని తెలిపారు.గ్రామ/ వార్డు సచివాలయలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ అందించి వారి ఉద్యోగ నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని నిర్ములంచడం ఒక బాధ్యతగా పేర్కొనాలని తెలిపారు.రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ప్రభుత్వ ధ్యేయమైనా
మద్య రహిత సమాజం లో భాగంగా మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.