ap news

రంజాన్ స్పెషల్..హైదరాబాద్ హౌస్ హలీమ్..

డెక్కనీ, హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి గడించిన హైదరాబాదు హౌస్ రెస్టారెంట్  రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలను సిద్దం చేసింది.  హైదరాబాదు హవుస్ రెస్టారెంట్ కే సొంతమైన ఈ రుచులను ఇంటి వద్ద అందించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.  అంతే గాకుండా ఎక్కువ సంఖ్యలో అవసరమైన వారికి అంటే బల్క్ ఆర్డర్స్ ను ఇచ్చే వారికి ప్రత్యేక డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది.

ముఖ్యంగా రంజాన్ అంటే గుర్తుకువచ్చే.. హైదరాబాదుకే ప్రత్యేకమైన హలీం ను హైదరాబాదు హౌస్ వారు మాత్రమే తమ రెస్టారెంట్ లో 365 రోజులు అందుబాటులో ఉంచుతున్నారు.  అయితే ఈ ప్రత్యేక రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బోన్ లెస్ మటన్ హలీం ను మరింత రుచికరంగా అందిస్తున్నారు.  పూర్తిగా హైదరాబాదీ సాంప్రదాయలకు అనుగుణంగా ఈ హలీమ్ ను తయారు చేస్తున్నారు.

దీంతో పాటు మటన్ షికంపూర్, మారగ్ సూప్, పాయా, ముర్గ్ మలాయ్ కబాబ్, కుబానీ కా మీఠా, డబుల్ కా మీటా, షీర్ కోర్మా ల వంటి ప్రత్యేక వంటకాలతో కూడిన ప్యాకేజీలను అందిస్తోంది.  ఈ ప్యాకేజీలను భోజన ప్రియులు తమ ఇంటి వద్దనే ఆస్వాదించేలా ప్రత్యేక డెలివరీ ఏర్పాట్లను కూడా చేసింది.  ఈ గిఫ్ట్ ప్యాకేజీలను తమ బంధువులకు, మిత్రులకు, కొలీగ్స్ కు ఎవరైనా ప్రత్యేకంగా అందజేసేందుకు వీలు కలిపించింది.

ఈ రంజాన్ ప్రత్యేక మెనూ ఐటంలతో పాటూ రెస్టారెంట్ లో సాధారణ, ఇతర రోజులలో లభించే బిర్యానీ, ధమ్ కా గోస్త్, తలాహువా గోస్త్, హరిమిర్చి గోస్త్, అచారీ ముర్గ్, దమ్ కా ముర్గ్, బగారా బైగన్, దివానీ హండీ వంటి కూరలు మటన్ లుక్మి, మటన్ షికంపురి, మటన్ హలీం, షీక్ కబాబ్, పథర్ కి గోస్త్, బాటి కబాబ్, ముర్గ్ మలాయి, బంజారా కబాబ్, లసూని ముర్గ్ టిక్కి, తంగ్డి కబాబ్, పనీర్ టిక్కా, వెజ్ షీక్ కబాబ్, మలా బ్రొకోలి, వెజ్ గలౌటి వంటి స్టార్టర్స్, కబాబ్ ల తో పాటూ షీర్ కోర్మా, డబుల్ కా మీఠా, కుబానీ కా మీఠా వంటి స్వీట్స్ తో పాటూ మిగిలిన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి.  భోజన ప్రియులు వాటి రుచులను యథావిధిగా ఆస్వాదించవచ్చు.

డిస్కౌంట్లు

అంతే గాకుండా Rs. 1000/- లకు మించి ఆర్డర్ పెట్టే వారికి ప్రత్యేకంగా 10 శాతం తగ్గింపును హైదరాబాద్ హవుస్ రెస్టారెంట్ వారు అందిస్తున్నారు.  దీనితో పాటూ హైదరాబాదు హవుస్ కు సంబంధించిన వార్తను కలిగిన క్లిప్పింగ్ చూపించిన వారికి కూడా ఈ డిస్కౌంట్ అందిస్తారు.  దీంతో పాటూ HHRM22 అనబడే కోడ్ వర్డ్ ను చెప్పిన వారికి కూడా ఈ డిస్కౌంట్ సదుపాయం వర్తించనుంది.

డెక్కనీ లేదా హైదరాబాదీ వంటకాలను ఇష్టపడే వారందరూ హైదరాబాదు హౌస్ అందిస్తున్న ఈ రుచులను అస్వాదించాలని రెస్టారెంట్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *