ఘోర ప్రమాదం..భార్యా భర్తలు మృతి

జాతీయ రహదారిపై యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఒరిస్సారాష్ట్రం గంజం జిల్లా, బరంపుర్ మండలంకు చెందిన భార్యాభర్తలు సుభాష్ నాయక్ (40), ఈదా (35)లు గత ఏడు నెలలుగా స్థానిక నందివర్ణన స్పిన్నింగు మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు బుధవారం చిలకలూరిపేట వెళ్లి ఆటోలో తిరిగి వచ్చారు. మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న దంపతులను కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులకు ఒక బాబు ఉన్నాడు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ ఐ రాంబాబు సంఘటనా ఫలానికి చేరుకుని దర్వాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published.