మంత్రి సురేష్ ను పరామర్శించిన హోం మంత్రి
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను హోం శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇటీవల మంత్రి సురేష్ కు మోకాలు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమాజిగూడ లోని ఎశోద హాస్పిటల్ లో ఉన్న సురేష్ ను ఆదివారం హోం మంత్రి వనిత పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.