కేరళ చేరుకున్న పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స కోసం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.
