అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం నిధులు

20 జిల్లాలకు రూ.27 కోట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది. బాపట్ల, కృష్ణా, ప.గో., కోనసీమ, తూ.గో., కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *