జనసేనలో చేరిన సీనియర్ న్యాయవాది పీవీ రెడ్డి
ఒంగోలుకు చెందిన సీనియర్ న్యాయవాది పెద్దిరెడ్డి వెంకటేష్ (పీవీ రెడ్డి) జనసేనలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ జడా బాల నాగేంద్ర ఆధ్వర్యంలో హైదరబాద్ లో ఉన్న బాలినేని వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. తాను వృత్తిపరంగా న్యాయవాదినే అయినా బాలినేని ముఖ్య అనుచరునిగా ఉన్నానని ఈ సందర్భంగా పీవీ రెడ్డి అన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో గతంలో తనకు మెడికల్ డ్రగ్స్ విభాగానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అవకాశం కల్పించారని తెలిపారు. బాలినేని నాయకత్వలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పీవీరెడ్డి తెలిపారు.