ap news

సీఎంతో కంది రవిశంకర్, జోయలుకాస్ చైర్మన్ భేటీ

అమరావతిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రవిశంకర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కంది రవిశంకర్, జోయాలుకాస్‌ ఛైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జోయలుకాస్ వర్గిస్‌ జాయ్‌, రవిశంకర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కంది సాయినాథ్, జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంకు  పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. జోయాలుకాస్‌ను కంది రవిశంకర్ సి.ఎం.కు పరిచయం చేశారు. రాష్ట్రంలో గోల్డ్‌ మాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు జోయాలుకాస్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సి.ఎం. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి యూనిట్‌ ఏర్పాటుతో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. రవిశంకర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కంది రవిశంకర్‌, జోయాలుకాస్‌ ఛైర్మన్‌ జోయాలుకాస్‌ సి.ఎం.తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు.

సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న జోయాలుకాస్‌ ఛైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జోయలుకాస్ వర్గిస్‌ జాయ్‌
రవిశంకర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కంది రవిశంకర్,రవిశంకర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కంది సాయినాథ్ లు సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న దృశ్యం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *