ap news

దళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

పోరాడి సాధించుకున్న చట్టాలపై ఉక్కుపాదం
కారంచేడు దళిత వీరుల వర్ధంతి సభలో
దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయకుమార్

ఆంధ్రావని న్యూస్, గుంటూరు : దళిత ఉద్యమం పోరాడి సాధించుకున్న హక్కులనూ, చట్టాలనూ, ప్రత్యేక బడ్జెట్ లను ప్రభుత్వం కాల రాస్తోందని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని డీబీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కారంచేడు దళిత అమరవీరుల 41 వ వర్ధంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు భూపతి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. అత్యాచార బాదితులకు సరైన న్యాయం జరగటంలేదని ఈ సందర్భంగా వినయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితలను రాజకీయ శత్రువులుగా పరిగణించి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది..వివక్ష చర్యలు తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అణగారిన కులాలు, శ్రామిక వర్గాలు ఐక్యతతో సామాజిక రాజకీయ ఉద్యమ శక్తిగా మారి అణిచివేత, దౌర్జన్యాలు, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పరాటం చేయాలన్నారు. కారంచేడు దళిత అమరవీరు నిజమైన నివాలి అన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నేతలు బుస్సా రత్నప్రసాద్, పొందుగల ప్రకాష్, తురక వీరయ్య, గంగోలు సామ్యూల్, చంద్రనాయక్, సూరిబాబు, నల్లపు నీలాంబరం, సూరిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *