ap news

ఏపీలో విస్తృతంగా క్యాన్సర్ వైద్య సేవలు

ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల

క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు

బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్’ సేవలపై వైద్యులకు శిక్షణ

ప్రతి జిల్లా కేంద్రం లో, అందుబాటులోకి డే కేర్ కీమోథెరపీ సెంటర్లు

ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల ఏర్పాటు

అందరి భాగస్వామ్యంతోనే క్యాన్సర్ కట్టడి..

ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు

  • నేడు క్యాన్సర్ డే

రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్య సేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాణాంతకంగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు అందరు కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ముందస్తు జాగ్రత్తలు, తగిన ప్రాథమిక పరిశీల ద్వారా క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోని అరికట్టవచ్చునని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 4వ తేదీ ( బుధవారం )
క్యాన్సర్ డే పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న కేసులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గుర్తించిన అంశాలు తీసుకోబోతున్న చర్యల గురించి గురించి మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరించారు.

రూ.4,751 కోట్ల ఖర్చు

రాష్ట్రంలో 2007-2008 నుంచి 2025-26 జనవరి 24వ తేదీ వరకు క్యాన్సర్ తో బాధపడే (6,32,426) వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఉచితంగా అందించిన వ్యయం రూ.4751.82 కోట్లకు చేరుకుందని తెలిపారు ఇందులో మహిళలకు (3,99,829) ఖర్చు పెట్టిన వ్యయం రూ.2,997 కోట్ల వరకు ఉందని చెప్పారు. 2,32,597 మంది పురుషులకు ఖర్చు పెట్టిన వ్యయం రూ.1,754.477 కోట్ల వరకు ఉందని వివరించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.675.66 కోట్లను క్యాన్సర్ పీడితులకు వైద్యాన్ని అందించేందుకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. 2025-26లో జనవరి 24వ తేదీ వరకు రూ.585.22 కోట్లును ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. క్యాన్సర్ వ్యాధులపట్ల ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తూనే ఎన్సీడీ-4.0 ద్వారా బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ‘పాలియేటివ్ కేర్’ కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా క్యాన్సర్ పీడితులకు ఎలాంటి వైద్యాన్ని అందించాలన్న దానిపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు.

పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు*

 

దీర్ఘకాలిక వ్యాధులతో ముఖ్యంగా క్యాన్సర్ వంటి జబ్బులతో మంచానికి పరిమితమై చివరి దశలో ఉన్న వారికి సాంత్వన చేకూర్చేందుకు కర్నూలు, గుంటూరు, కాకినాడ, వైజాగ్, తిరుపతిలోని బోధనాసుపత్రుల్లో 5 నుంచి పది పడకల ఏర్పాటుతో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వైద్యులు, స్టాఫ్ నర్సులకు విశాఖలోని హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూటు ద్వారా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రమంగా అన్ని బోధనాసుపత్రుల్లో ఈ తరహా కేర్ సెంటర్లను ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లోని లెవల్-1 క్యాన్సర్ కేర్ సెంటర్, విశాఖ కేజీహెచ్లో లెవల్-2, కర్నూలు జీజీహెచ్లో రాష్ట్ర సాయి క్యాన్సర్ సెంటర్, కడపలోని క్యాన్సర్ సెంటర్స్ట్వారా కూడా రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునాతన యంత్రాలు/పరికరాలు/వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అవసరాలకు అనుగుణంగా, బోధనాయసుపత్రులతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించామని మంత్రి శ్రీ సత్యకుమార్ వివరించారు.

 

డే కేర్ కీమోతెరపీ సెంటర్లను 23 సెకండరీ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీనివల్ల ప్రతి విడత కు కీమోథరపి కోసం రోగులు ఎక్కువ దూరం ప్రయాణించవలసిన అవసరం లేకుండా, వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు

జిల్లాలు/మండలాల వారీగా క్యాన్సర్ కేసుల గుర్తింపు

రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల జాతీయ సగటు కేసుల నమోదుతో పోల్చితే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీ సత్యకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. 2020 నాటికి 25,487 కేసులు ఉండగా.. 2025 నాటికి 35,546కు కేసులు పెరిగాయి. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడు సూచనల మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందిన బాధితుల వివరాల ఆధారంగా జిల్లాలు, మండలాల వారీగా కేసుల వివరాలతో ప్రత్యేకంగా ‘అట్లాస్’ (2021-25) తయారైంది. 2021-25 మధ్య ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందిన వారిలో 64.19% మంది మహిళలు, 35.82% మంది పురుషులు ఉన్నారు. ఇందులో మెడికల్ అంకాలజీ విభాగంలో చికిత్స పొందిన వారు 81.68%, సర్జికల్-6.62%, రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందిన వారు 11.71% మంది చొప్పున ఉన్నారు. ఏయే జిల్లాలు, మండలాల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల సదరు జిల్లాల్లో ముందస్తు చర్యలు, వైద్యసేవలు అందించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసేందుకు* వీలు ఏర్పడిందని మంత్రి శ్రీ సత్యకుమార్ వివరించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

కొనసాగుతున్న పరీక్షలు

ముందస్తు జాగ్రత్తల్లో (ప్రివెన్షన్) భాగంగా ఎన్సీడీ-4.0 కింద రాష్ట్రంలో ఆరోగ్య సిబ్బంది సదరు ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నోటి, (ఓరల్),* రొమ్ము* (బ్రెస్ట్), మరియు గర్భాశయ ముఖద్వార * (సర్వైకల్) క్యాన్సర్లను గుర్తించేందుకు వీలుగా ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేస్తున్నారని మంత్రి శ్రీ సత్యకుమార్ తెలిపారు. హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో పరీక్షల నిర్వహణ తీరుపై 18వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు చేతుల మీదుగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. NCD 4.0 కింద ఇప్పటివరకు 1,44,39,648 మంది పురుషులకు నోటి కాన్సర్ కొరకు, 76,05,540 మంది మహిళలకు నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార కాన్సర్ కొరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే లో పరీక్షలు నిర్వహించగా, 3,71,757 మందిని నోటి కాన్సర్, 1,80,703 మంది రొమ్ము మరియు 2,46,190 మంది గర్భాశయ ముఖద్వార కాన్సర్ నిర్ధారణ కొరకు వివిధ దశలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం మొదలవక ముందు, కాన్సర్ కేసులు ముదిరిన దశలో (Advanced stages) వచ్చేవని, ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్న కేసుల గుర్తింపు (Early stage) జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది మంచి మార్పునకు సంకేతం ) అని తెలిపారు.

పరీక్షలు చేయించుకోవాలని ‘ప్రత్యేక ఆహ్వానం’

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలు చేయించుకునేందుకు మహిళలు సంకోచిస్తున్నారు ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లు దాటిన మహిళలకు, ఆహ్వానపత్రిక అందించి, పరీక్షలకు రావాలని కోరుతోంది. ఆహ్వాన పత్రికలో పరీక్షలు ఎక్కడ చేస్తారో ప్రదేశం, తేదీ, సమయాన్ని ముద్రిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇస్తూ పరీక్షలు చేస్తున్నారని స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల తెలిపారు.

రూమ్ నెం.222 ద్వారా సేవలు*

రాస్ట్రంలోని అన్నీ బోధనాసుపాత్రులలో, రూమ్ నం. 222 తో, స్క్రీనింగ్ కొరకు, అలాగే సర్వే లో భాగంగా వివిధ పరీక్షల కొరకు వచ్చే వారి కోసం ప్రత్యేక ఓపి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిoది. ఈ విభాగం, ప్రతి మంగళ, గురు వారాలలో సేవలందిస్తోందని, ఈ విభాగంలో అవసరమైన వైద్యులు ఒకేచోట అందుబాటులో ఉండి, అదే రోజు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు.

అవగాహన ముఖ్యం

నానాటికీ పెరుగుతూ వస్తున్న ఈ క్యాన్సర్ ను ఎదురుకోవడానికి ప్రజలలో అవగాహన పెంచి , నివారించటమే మార్గమని మంత్రి శ్రీ సత్యకుమార్ ఉద్ఘాటించారు. Let’s Discuss అనే నినాదంతో, ప్రజలను, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో కలిసి నడిచే ప్రతి ఒక్కరితో రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవగాహన కార్యక్రమాలునిర్వహిస్తుందని తెలిపారు ఇందులో భాగంగా ప్రముఖ సీనియర్ నటి, లైఫ్ అగైన్ ఫౌండేషన్ స్థాపకురాలు గౌతమి  అవగాహన కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *