ఆటో జాతతో ముమ్మర ప్రచారం

- కండ్రికలో ప్రారంబిన కార్మిక సంఘం నాయకులు
- 4 లేబర్ కొడ్స్ రద్దు చేయాలని డిమాండ్
- 12న సమ్మెకు సమాయత్తం కావాలని పిలుపు
విజయవాడ: రెండు రోజుల పాటు నగరంలో పలు ప్రాంతాల్లో ఆటో జాత జరగనుంది. శుక్రవారం నగరంలోని కండ్రిక ఆర్టీసీ బస్ స్టాఫ్ లో ఈ ఆటో జాత కేంద్ర కార్మిక సంఘం ఎన్టీఆర్ నాయకులు ప్రారంభించారు. జాత నగరంలోని కండ్రికలో ప్రారంభమైయింది. అక్కడి నుంచి ప్రకాష్ నగర్, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, ఊర్వశి సెంటర్, ఆటోనగర్, పటమట, కృష్ణాలంక, బీసెంట్ రోడ్డులో ముగింది. తొలత ప్రారంభ సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె. దుర్గారావు అధ్యక్షుత వహించారు. ప్రారంభ సభలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, సిఐటియు జిల్లా కార్యదర్శి కమల, అధ్యక్షులు ఎ. వెంకటేశ్వరావు, ఏఐసిసిటియు జిల్లా నాయకులు యం. ఈశ్వర్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 4 లేబర్ కొడ్స్ రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ తో ఫిబ్రవరి
12న సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల పోరాట ఫలితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 22 కార్మిక చట్టలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కొడ్స్ ఏర్పాటు చేయటం, అమలు చేయటం వలన కార్మికులకు నష్టదాయకమన్నారు. బడా కార్పొరేట్ కంపెనీల యజమానులకు లేబర్ కొడ్స్ ఉపయోగపడతాయని, కార్మికులకు వెట్టిచాకిరి తప్ప మరోకటి మిగలదని ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘం నాయకులందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12 న జరిగే సమ్మెలో అందరు పాల్గొనాలని పిలువునిచ్చారు. నగరంలోని వన్ టౌన్ రథం సెంటర్ నుంచి గవర్నర్ పేట లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని, అందులో అందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

