ap news

12న సమ్మె..ముమ్మర ప్రచారం

విజయవాడ లెనిన్ సెంటర్ లో సమ్మెపై ప్రచారం చేస్తున్న కార్మిక సంఘాల నేతలు

లెనిన్ సెంటర్ లో కరపత్ర ప్రచారం

విజయవాడ: నగరంలోని లెనిన్ సెంటర్ లో కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం కరపత్ర ప్రచారం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మూడురోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం ఊపదుకుంది. బీసెంట్ రోడ్డులోని షాఫ్ ఎంప్లాయిస్ కి, హామాలీలకు, హాకర్ లకు, షాపు యజమానులకు 12న సమ్మె కరపత్రం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లెనిన్ సెంటర్ లో కేంద్ర కార్మిక సంఘం నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నాలుగు లేబర్ కొడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతం వలె కార్మిక చట్టాలను, హక్కులను కోనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల, కార్మికులకు లేబర్స్ కొడ్స్ నష్టదాయకమని వివరించారు. 12 న సమ్మెలో పాల్గొని ఎడిఏ ఆధ్వర్యంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వానికి లేబర్ కొడ్స్ రద్దు చేసేలా ప్రదర్శన సాగాలన్నారు. వన్ టౌన్ రథం సెంకర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు వేలాది కార్మికులతో ప్రదర్శన కొనసాతుందని, అనంతరం లెనిన్ సెంటర్ లో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ. వెంకటేశ్వరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె. దుర్గరావు, జిల్లా నాయకులు నారాయణ, ఏఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి ఎ. ఉదయ్ కిరణ్, జిల్లా కార్యదర్శియం. ఈశ్వర్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *