రాష్ట్రంలో మేఘాలయ ఎన్ హెచ్ ఎం బృందం పర్యటన

– ఎనీమియా ముక్త్ భారత్ అమలు తీరుపై పరిశీలన
ఎనీమియా ముక్త భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అవలంబిస్తున్న విధానాలను మేఘాలయ జాతీయ ఆరోగ్య మిషన్ అధికారుల బృందం సమీక్షిస్తోంది. ఎ నీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంది. మేఘాలయ ఎన్. హెచ్ ఎం. సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇతరులు సోమవారం మంగళగిరిలో నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మంగళవారం అంగన్వాడీ, పీ హెచ్ సి లను అధికారుల బృందం సందర్శించనుంది.
ప్రోగ్రాం ఆఫీసర్లతో భేటీ
మేఘాలయ అధికారుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు పథకాల అమలు పర్యవేక్షణ అధికారుల (ఎన్ హెచ్ ఎం)తో ప్రత్యేకంగా సమావేశమై వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎ నీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్త హీనత తగ్గించేందుకు అందచేస్తున్న సిరప్, మాత్రల పంపిణీ, ఇతర చర్యల గురించి అధికారుల బృందం ఆసక్తిగా అడిగి తెలుసుకుంది.
