ap news

10 జిల్లాల్లో హెచ్పివీ టీకా పంపిణీ ప్రారంభం

14 ఏళ్ల బాలికలకు మాత్రమే

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి

గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్ క్యాన్సర్) ముప్పు తప్పించేందుకు 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా పంపిణీ సోమవారం పది జిల్లాల్లో ప్రారంభమైంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం నుంచి ప్రారoభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటన జారీ చేశారు. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, శ్రీ సత్యసాయి, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో టీకా పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైoదని తెలిపారు. సుమారు 1500 మందికి వాక్సినేషన్ జరిగిందని తెలిపారు.

1,647 ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు

రాష్ట్రంలో కోల్డ్ చైన్ (వ్యాక్సిన్ భద్రపరిచే) సౌకర్యం ఉన్నట్లు గుర్తించిన 1,647 పీహెచ్సి, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ను పంపించారు. గ్రామ/ వార్డు సచివాలయాల్లో రికార్డుల ఆధారంగా 14 ఏళ్ల బాలికలు రాష్ట్ర వ్యాప్తంగా 3. 45 లక్షల మంది ఉన్నారని గుర్తించారు. వీరికి మాత్రమే ఈ టీకా వేస్తున్నారు. దీనికి ముందు ఎ. ఎన్. ఎం.లు, ఆశాలు బాలికల సదరు బాలికల తల్లిదండ్రులను కలిసి టీకా ప్రాధాన్యాన్ని సూచిస్తున్నారు. ఏయే ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారో కూడా చెబుతున్నారు. టీకా వేసే సమయంలో తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతిని తీసుకుని యువిన్ యాప్లో నమోదుచేస్తున్నారు. ఆధార్కార్డు నెంబరు ఆధారంగా ఓటీపీ రూపంలో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టీకా పంపిణీ ప్రారంభకార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.

3 మూడు నెలలపాటు..

టీకా ఇచ్చిన అనంతరం బాలికలను 30 నిమిషాలపాటు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పలువురికి ఇంజెక్షన్ ఇచ్చినచోట నొప్పి, ఎర్రదనం, వాపు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా 2-3 రోజుల్లో తగ్గుతాయి. హెచ్పీవీ టీకా సురక్షితమైనది. ప్రభావవంతమైంది. భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్ను నివారించడంలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక ప్రాత పోషిస్తుంది మూడు నెలలపాటు టీకా పంపిణీ కార్యక్రమం జరగనుంది. |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *