టీటీడీ ఆలయాల్లో దీపావళి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో గురువారం దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి బాలాలయంలోని స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో….

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా గురువారం రాత్రి దీపావ‌ళి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి పార్వ‌తి, శ్రీ రాజేంద్రుడు, ఏఈవోలు శ్రీ దుర్గరాజు, శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.