రూ 52కే కిలో బియ్యం

26 కేజీల వరకు కొనుగోలుకు అవకాశం
బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే బియ్యం కొనుగోలు పరిమితిని పెంచింది. గతంలో 10 కిలోల వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు 26 కిలోల బస్తాను కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అదనంగా, విడిగా ఎన్ని కిలోలైనా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వం BPT (స్టీమ్) బియ్యం కిలో రూ.52, రా బియ్యం కిలో రూ.50 చొప్పున అందిస్తోంది.
