ap news

గవర్నర్ ను కలిసిన జోగి మేఘన

జోగి మేఘన

అత్తమామాలు, భర్త నుంచి ప్రాణహాని

రక్ణణ కల్పించాలని వినతిపత్రం

మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. తన తండ్రి తో కలిసి గవర్నర్ ను కలిసిన ఆమె తన అత్త మామలైన జోగిరమేష్, శకుంతల, భర్త రాజీవ్ లతో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందనీ, తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. తన తల్లిదండ్రులు పెళ్ళి సమయంలో రూ 5 కోట్లు ఖర్చు పెట్టారు..అది చాలక పెళ్ళయిన కొన్నాళ్ళకే రూ 5 కోట్ల కట్నంతో పాటు ఇతర విలువైన ఆస్తులు తీసుకురావాలని వేధిస్తున్నట్టు గవర్నర్ కు అందించిన వినతిపత్రంలో ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *