నాగబాబుకు కేబినెట్ హోదా

శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టు గతంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించినా ఆచణరణలో అమలు కాలేదు. మంత్రి పదవికి బదులు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియమించారు. కేబినెట్ హోదా కల్పిస్తూ ఇపుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
