మార్కాపురంలో టీడీపీ ఎన్నికల సమావేశం

హాజరయిన ఒంగోలు ఎంపీ మాగుంట
స్థానిక సంస్థల సన్నాహాక సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కేంద్రమైన మార్కాపురంలోని మార్కెడ్ యార్డు ఆవరణలో నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మార్కాపురం ఇన్ ఛార్జిగా నియమితుడైన మార్కాపునరం జిల్లా ఇన్ చార్జి బీటీ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంటలో పాటు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు హాజరయ్యారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం ఇంచార్జ్ ఎరిక్షన్ బాబులు పాల్గొన్నారు.

