చదలవాడలో ఫైవ్ స్టార్ హోటల్
రవిశంకర్ కు మాగుంట, దామచర్ల అభినందనలు
ఒంగోలు సమీపంలో చదలవాడ గ్రామం లో ‘రాడిసన్-రవి ప్రియ ఫైవ్ స్టార్ హోటల్’ ప్రాజెక్టు ను ప్రారంభించబోతున్న ప్రముఖ వ్యాపారవేత్త, జనసే నాయకుడు కంది రవిశంకర్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ లు అభినందించారు. ఒంగోలుకు తలమానికంగా ఫైవ్ స్టార్ హోటల్ ను స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని మాగుంట ఆకాంక్షించారు. రవిశంకర్ నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్ ప్రాజెక్ట్ కు పర్యాటక విధి విధానాల్లో భాగంగా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందేలా చూస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ దంపతులను రవిశంకర్ శాలువాతో సత్కరించారు.


