Prakasam

13న ఒంగోలులో తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సభ

మ్యాన్ ఆఫ్ ది ఎర్త్ డాక్యుమెంటరీ ప్రదర్శన
సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి వెల్లడి

విప్లవ కమ్యూనిస్ట్ నాయకుడు, మార్క్సిస్ట్ మేధావి తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సభను ఈనెల 13 సాయంత్రం 4 గంటలకు ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి తెలిపారు. ప్రముఖ న్యాయవాది, టీఎన్ఎం ట్రస్ట్ సభ్యుడు పంగులూరి గోవిందయ్య అధ్యక్షత వహించనున్న సభలో ట్రస్ట్ చైర్మన్ సింహాద్రి ఝాన్సీ తరిమెల నాగిరెడ్డి స్మారకోపన్యాసం చేయనున్నారు. ఈ సభలో తనతో పాటు మ్యాన్ ఆఫ్ ది ఎర్త్ డాక్యుమెంటరీ వ్యాఖ్యత అజయ్ ఘోష్, రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) జిల్లా కార్యదర్శి లలితకుమారి, టీఎన్ఎం ట్రస్ట్ సభ్యుడు ఇండ్ల పార్ధసారధి సభలో మాట్లాడనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా తరిమెల నాగిరెడ్డిపై జీవితంపై ధరిత్రీ క్రియేషన్స్ నిర్మించిన మ్యాన్ ఆఫ్ ది ఎర్త్ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు స్వామి తెలిపారు. ఈ సభకు విప్లవాభిమానులు, ప్రజాస్వామికవాదులు, పౌర, ప్రజాస్వామ్య సంఘాల కార్యకర్తలంతా హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *