తీవ్ర సంక్షోభంతో ముగిసిన ఖరీఫ్

ఎంవీఎస్ నాగిరెడ్డి రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్

ఖరీఫ్ సాగును కుంగదీసిన వర్షపాతం లోటు

రైతులకు కరువు సహాయం ప్రకటించాలి 

రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ చైర్మన్ నాగిరెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొని ముగిసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగి రెడ్డి అన్నారు. వర్షపాతం లోటు పంటను కుంగదీసిందన్నారు. జులై లో వర్షపాతం లోటు -67.9 శాతం.. ఆగస్టులో -55.9 శాతం, జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు -55.4 శాతం లోటు ఏర్పడింది. సెప్టెంబర్ 15 నుండి 25 వరకు కురిసిన వర్షాలకు సెప్టెంబర్ 26 నాటికి లోటు -32.17 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ 27నుంచి తీవ్రమైన వర్షాభావం మొదలైంది. వర్షాధార ప్రాంతాల్లో వేరుశనగ, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, మినుము పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అనేక చోట్ల పండ్ల తోటలు ఎండిపోయాయి. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలకు, కె సి కెనాల్, హెల్సీ, ఎల్ ఎల్ సి ఆయకట్టుకు సాగుకుకు నీరు అందలేదు. కృష్ణా డెల్టా కు 12 వేల క్యూసెక్ లకు గాను 5.5 నుండి 6.5 వేల క్యూసెక్కు నీరు మాత్రమే విడుదలైందని నాగిరెడ్డి తెలిపారు.

బియ్యం ధరలకు రెక్కలు

సోనా ముస్సోరి బియ్యం పండే ప్రాంతాలకు సాగు నీరు అందలేదని నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటికే కిలో రూ 80గా ఉణ్న సోనా ముస్సోరి ధర మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. బియ్యంతో పాటు పప్పు, నూనె, కూరగాయల ధరలు పెరిగి వినియోగదారులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు..ప్రభుత్వ హామీల మేరకు ఇప్పటికే చెల్లించ వలసిన ‘0’ వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ బకాయిలు, అన్న దాత సుఖీభవ బకాయి, ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం బకాయిలను చెల్లించటంతో పాటు పంట నష్ట పోయిన రైతులకు తక్షణమే కరువు సహాయం అందించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *